రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామం కేజీవిబీ పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలలో నిన్నటి రోజు షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రిన్సిపాల్ రూములో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులకు ప్రాణాపాయం కలుగలేదు సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి కస్తూర్బా గురుకులను సందర్శించి జరిగిన ప్రమాదంపై వార్డెన్ ను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిషన్ లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే సరిచూసుకోవాలని తగిన సూచనలు చేశారు. తన వెంట ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో చిరంజీవి, ఎంపీపీ పిల్లి రేణుక,గ్రామ సర్పంచ్, సెస్ అధికారి, కార్యదర్శి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.