-రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్
కుల మతాలకతీతంగా ఒకరి సాంప్రదాయాలు, ఆచారాలను మరొకరు గౌరవిస్తూ కలిసిమెలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో పోచమ్మ గుడికి లక్ష రూపాయల విరాళం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంతూర్ గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణానికి మాజీ సర్పంచ్ మహమ్మద్ అలీమోద్దీన్ జ్ఞాపకార్థం లక్ష రూపాయల విరాళం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే హిందూ ముస్లింలందరూ కులమత బేధాలు లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటే ఎలా ఉంటుందన్నారు. ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని ఎలాంటి విభేదాలు లేకుండా అందరి పండుగలను సాంప్రదాయకంగా గౌరవించుకోవాలన్నారు. గ్రామంలో అందరి సహకారంతో పోచమ్మ గుడి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకొని ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ సమియుద్దిన్, గ్రామస్తులు జరిగాయి.