*లేబర్ అడ్డ కి స్థలాన్ని కేటహించి, సౌకర్యాలు కల్పించాలి*
*తెలంగాణ లేబర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్*
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ లేబర్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు వేలాది మంది లేబర్లు రోజు వారి కూలి కోసం లేబర్ అడ్డ దగ్గర వేసి చూస్తూ ఉంటారు.అందులో మహిళ కూలీలు కూడా ఉంటారు.లేబర్ అడ్డ కి ప్రత్యేక స్థలం లేక మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.కాబట్టి జిల్లా ఉన్నత అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి లేబర్ అడ్డ కి స్థలాన్ని కేటహించి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఎంతో కాలంగా నెలకొని ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల అధ్యక్షులు పెదల చంద్రకాంత్, ఎమ్.డి. లథీఫ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.





