ప్రాంతీయం

దుబ్బాకలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే

84 Views

దౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని బిఆర్ఎస్ నాయకులు శివరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని పార్టీలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. కొంతమంది ఎన్నికలప్పుడే గ్రామాలకు ఓట్ల కోసం వస్తారని అలాంటివారిని నమ్మవద్దని, నిరంతరం మీ వెన్నంటే ఉండి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *