నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలంగా ఉంది
మండల ఆకాంక్షను నెరవేర్చండి
ని
యోజకవర్గం ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సూన్యం
ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి
ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 16
జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మల్లంపల్లి మండలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
2018 సంవత్సరంలో ముఖ్య మంత్రి మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారని ములుగు జిల్లా అయ్యింది కానీ మల్లంపల్లి మండల ఏర్పాటు చేయలేదు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని ఇక్కడి బలంగా కోరుకుంటూ మా నియోజకవర్గానికి ప్రకటించి న ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నా రు.గత ఐదు సంవత్సరాల నుంచి ములుగు నియోజకవ ర్గంలో ఎమ్మెల్యే గెలవకపోవడం వల్ల అధికార పార్టీ నాయకుల మైన మేము ఎంత ఇబ్బంది పడినామో నాయకుల అంద రికీ తెలుసు కాబట్టి నాయకులు అందరం కలిసికట్టుగా ఓటర్ల వద్దకు వెళ్లి చేసిన అభివృద్ధిని వివరించి సంక్షేమ పథకాలను తెలియజేసి బడే నాగజ్యోతిని ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపిం చుకొని ముఖ్యమంత్రికి కానుక గా ఇస్తామని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయలేదని కూరగాయలు బియ్యం ఇచ్చి అభివృద్ధి అనడం విడ్డురంగా ఉంది నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు తట్టేడు మట్టి పోసిన దాకలాలు లేవు దానితో నియోజకవర్గం అత్యంత వెనుక బాటుకు పోయిందని అన్నారు.అందువల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందలంటే గిరిజన ముద్దు బిడ్డ మన ఆడ బిడ్డను అత్యధిక మెజారిటీతో గెలిపించుకో వాలని ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి అన్నారు.



