ముస్తాబాద్ సెప్టెంబర్16, పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధులను మంజూరు చేసింది. నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది కానీ అధికారులు కుమ్మక్కై ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం కాలేదన్న గూడూరు సర్పంచ్.. జిపిభవనం 4,సం పైచిలుకు గడిచిన నత్త నడకన సాగుతుందని సర్వసభ్య సమావేశంలో తన ఆవేదనతో వివరించారు. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడే త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభించేలా చర్యలు తీసుకున్న ఫలితం లేకపోయింది. అధికారులు ఏమైనా ఆశిస్తున్నారా ఇంకేమైనా పుండకోరు నాయకులు పుల్లలు పెట్టి ఆపుతున్నారా.. ఇది ఇలాగ కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గూడూరు సర్పంచి సాకల రమేష్ ఆవేదనతో మాట్లాడిన మాటలు విని ప్రజాప్రతినిధులు వెను వెంటనే అధికారులకు ఫోన్లుచేసి మాట్లాడి త్వరితగతిన భవన నిర్మాణపనలు పూర్తి కావాలని సభాముఖంగా ఆదేశాలు జారీచేశారు.
