రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డి.ఐ.ఇ.ఓ చింతల మోహన్ ఆదేశాల మేరకు ఓటుపై సాంస్కృతిక పోటీలు,మాక్ పోలింగ్ శనివారం నిర్వహించారు.
ఓటు ప్రాధాన్యతపై కవితలు,పాటలు, నాటికలపై సాంస్కృతిక పోటీలు విద్యార్థులు పోటీలో పాల్గొని రాత పరీక్ష రాశారు.ఉత్తమమైనవి జిల్లాస్థాయి పోటీకి పంపించారు. అనంతరం నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా మాక్ పోలింగ్ నిర్వహించారు.పోలింగ్ బూత్లో ఎన్నికల ఓటింగ్ ఎలా జరుగుతుంది?విద్యార్థులే పోలింగ్ అధికారులుగా పాల్గొని వ్యవహరించారు.అనంతరం 18 సంవత్సరాలు నిండినవారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఓటును నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలనిఓటుపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు .ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, సాంస్కృతిక విభాగం ఇంచార్జి వాసరవేణి పర్శరాములు, చెరుకు భూమక్క, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు మాదాసు చంద్రమౌళి ,బుట్ట కవిత, నీరటి విష్ణుప్రసాద్, ఆర్.గీత, కొడిముంజ సాగర్, గౌతమి, చిలుక ప్రవళిక తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.