అసంపూర్తిగా అంబేద్కర్ భవన నిర్మాణ పనులు
తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు & ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబెర్ రాజమల్ల సుకుమార్
ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 16
మంగపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని తెలంగా ణ మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి కర్రీ నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో భవన నిర్మాణా పనులను పరిశీలిం చిన తెలంగాణ మాల మహా నాడు నాయకులు.ఈ సంద ర్భంగా ములుగు జిల్లా అధ్య క్షులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ జిల్లా సభ్యులు రాజ మల్ల సుకుమార్ మాట్లాడు తూ ములుగు జిల్లాలో 53 వేల ఓట్ల దళిత జనాభా కలిగిన జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం లేదని మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటం అత్యంత బాధాకర మని కేవలం ఓట్ల కోసమే దళితులను వాడుకుంటున్న ప్రజా ప్రతినిధులు భవాన నిర్మాణం కోసం చొరవ తీసుకోక పోవడం బాధాకరమని వేరే నియోజకవర్గాలలో ప్రజా ప్రతినిధులు వారి నిదుల నుండి అంబేద్కర్ భవన నిర్మాల కోసం నిధులను ఖర్చు చేసి నిర్మాణాలు చేస్తున్నారని ఈ జిల్లాలో ఉన్న ప్రజా ప్రతిని ధులకు దళిత జాతి పట్ల అంబేద్కర్ భవన నిర్మాణాల పట్ల కనీస శ్రద్ధ లేదని కేవలం దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు వాడుకుం టున్నాయని దివంగత మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ మంత్రిగా ఉన్నప్పుడు అంబే ద్కర్ భవన నిర్మాణం కోసం 25 లక్షల రూపాయల డబ్బులను భవన నిర్మాణం కోసం మంజూ రు చేశారు కానీ నిర్మాణ పను లు నేటికి పూర్తి కాకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి ఎన్నికల సమయం ముందు అయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయవలసిం దిగా తెలంగాణ మాల మహా నాడు ములుగు జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రాజమల్ల సుకుమార్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కర్రీ నాగేంద్ర బాబు,మండల అధికార ప్రతినిధి మురుకుట్ల నరేందర్,మాజీ మండల అధ్యక్షులు తాలూకా సంపత్, మండల సంగం నాయకులు దొడ్డ భాస్కర్,దాసరి సతీష్, నగరపు విరస్వామి,సాంబశివ రావు,పాల్గొన్నారు.