ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 83 మంది విద్యార్థులకు వచ్చే నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నందున వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల సభ్యుడు గడ్డం మధు మాట్లాడుతూ ఉన్నత చదువులకై పదో తరగతి బేస్ గా తీసుకుంటారని పదవ తరగతి తర్వాత మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్న ఏం చేయాలన్న బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అంతే కాకుండా మనం చదువుకున్న స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని ప్రతి విద్యార్థి 10 జిపిఏ సాధించాలని తపనతో కష్టపడి చదవాలని ఈ 2022-2023 సంవత్సరంలో ఎవరైతే ఈ స్కూల్లో 10 జిపిఏతో ఫస్ట్ క్లాస్ లో నిలుస్తారో వారికి సిల్వర్ మెడల్ అందజేస్తామని అన్నారు పిల్లలందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి హజ్జు నాయక్ ప్రభాకర్ టీచర్లతో పాటు చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల సభ్యులు ముత్యాల సత్యనారాయణ శ్రీరామోజు దేవరాజు కొమిరిశెట్టి శ్రీనివాస్ అశ్వక్ లు పాల్గొన్నారు
