జాతీయస్థాయిలో ఇన్స్పైర్ మా నక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందిన జడ్పిహెచ్ఎస్ హనుమా జిపేట విద్యార్థి మరిపెళ్లి అభిషేక్ తయారుచేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు భారత ప్రభుత్వం చే తన తండ్రి లక్ష్మీరాజ్యం పేరున పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది.
2019 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ,వరంగల్లోని మదికొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో మెరిట్ సాధించి జాతీయస్థాయిలో ఐఐటి ఢిల్లీలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో మూడవ స్థానం లభించడం జరిగింది. తన యొక్క తండ్రి ఐకెపి సెంటర్లలో ధాన్యం నింపునప్పుడు పరిశీలించిన అతను ధాన్యాన్ని సంచులలో నింపడానికి ఈజీగా ఉండే విధంగా ఈ ఎగ్జిబిట్ ను తయారు చేయడం జరిగింది.
ఈ విజయం సాధించిన తర్వాత నేను ఎన్ఐటి వరంగల్లో నెలరోజులపాటు రోబోటిక్స్ పై ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మరియు గుజరాత్లోని అహ్మదాబాదులో నిర్వహించిన ఫైన్ ఫైన్ప్రో గ్రాంలో పాల్గొనడం జరిగింది మరియు ఇన్స్పైర్, మొదటి రెండవ ,మూడవ స్థానం లభించిన విద్యార్థులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలవడం జరిగింది. ఎన్ ఐ ఎఫ్ రు నిర్వహించే సకూర జపాన్ ప్రోగ్రామ్కు కూడా ఎంపిక కావడం జరిగింది,
ఈ విద్యార్థిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఈవో రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ రావు,జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జంకేమల్లేశం, సర్పంచ్ జంకే విజయ శ్రీనివాస్ రెడ్డి, గైడ్టీ చర్ కోరెం వెంకటేశం, ఉపాధ్యాయ బృందం, అభినందించడం జరిగింది.




