Breaking News

దేశానికే ఆదర్శ0

132 Views

సిద్దిపేట్ జిల్లా  క్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం  కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు “ముఖ్యమంత్రి అల్పాహార పథకం  పథఅందించాలని సీఎం నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది.

తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు  చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *