రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో డబల్ బెడ్ రూమ్ లకు ఎదురుగా సుమారు 20 సంవత్సరాల క్రితం మండల యాదవ సంఘం కోసం కొనుగోలు చేసిన భూమినీ మండల యాదవ సంఘం భవన నిర్మాణం కోసం ఆప్పగించాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ రామచంద్రం కు వినతి పత్రం సమర్పించారు.
అదే విధంగా గ్రామాల్లో గొర్రెలు మేకలు మెపుకోవడానికి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జి.ఓ నెంబర్ 540 ప్రకారం గొర్రెలు మేకల పెంపకం కోసం అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని,అదే విధంగా కల్లు గీత,చేనేత కార్మికుల కు 50 సంవత్సరాల కే ఇస్తున్న మాదిరిగా మా గొర్రెల పెంపకం దారుల కు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరుతూ మండల తహశీల్దారు కు వినతి పత్రం అందజేశారు.ప్రభుత్వం దృష్టికి ఇట్టి సమస్యను నివేదిస్తానని మండల తహశీల్దార్ రామచంద్రం పేర్కొన్నారు.
15 రోజుల లోపు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న యాదవుల భూమినీ యాదవ సంఘం భవన నిర్మాణం కోసం కేటాయించాలని లేనిచో దశల వారీగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.