చెన్నూర్ నియోజకవర్గం, చెన్నూర్ మండల్ అంగ్రాజ్ పెల్లి చాకపెల్లి లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్, బి ఆర్ ఎస్, పార్టీ నాయకులు పొలిటికల్ టూరిస్టులు ఎన్నికల కోసం మాత్రమే వచ్చారు ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోతారు ,ఇప్పుడు ఎన్నికల కోసం వేల కోట్లు తెచ్చి నాయకులను పార్టీల్లోకి చేర్చు కుంటున్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిల్లిగవ్వ ఐన సహాయం చేశారా ఆలోచించండి వాల్లు ఇప్పుడు మాత్రమే బుజాల మీద చేతులు వేసి మాట్లాడుతారు ఎన్నికల తర్వాత వెల్లి కలిస్తే నువ్వు ఎవరు అని అడుగుతారు.
అలాంటి వారికి ఓటు వేసి కష్టాలు పడొద్దు ఎవరకి అవసరం ఉన్నా అందుబాటులో ఉంటాను. అరుహులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూస్తానని మీరందరు ఆలోచించి మీకు అందుబాటులో ఉండే నాకు
కమలం పువ్వు గుర్తు పైన ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు.






