రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే శుక్రవారం రోజు వారసంతలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి సినిమా థియేటర్ వరకు నిర్వహించే వారసంతలో ప్రజలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇదే అదునుగా భావించి దొంగతనాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకు వెళ్తున్నారు.
శుక్రవారం రోజు బండ లింగంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల, సింగారం గ్రామానికి చెందిన ఒకరిది, అల్మాస్పూర్ తనకు చెందిన మరొకరి నాలుగు సెల్ ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తులు అపకరించుకపోయారని బాధితులు శనివారం రోజు 24/7 తెలుగు న్యూస్ విలేకరితో అన్నారు.
వారసంతలో పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారసంతకు వచ్చే ప్రజలు అంటున్నారు.