Breaking News

క్షమాపణలు చెప్పాలి

57 Views

దుబ్బాక ఎమ్మెల్యే రజకులకు క్షమాపణలు చెప్పాలి.బీఎస్పీ

మార్చి 30

జోగులాంబ గద్వాల్ :- దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రజకులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని గద్వాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు సవరన్న అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రజక సామాజిక వర్గం నుంచే డాక్టర్ బాబాసాహెబ్ గురువు సంత్ గాడ్గే బాబా,చాకలి ఐలమ్మ లాంటి మేధావులు వచ్చారని గుర్తు చేశారు. చదువుకున్నోళ్ల కంటే సాకలోళ్ళు నయం అని ఎట్లా మాట్లాడుతారు..? అని ప్రశ్నించారు. ఒకరిని పోల్చడానికి మరొక సామాజిక వర్గ ప్రజలను ఉదాహరణగా తీసుకుంటారా.. అని అన్నారు. భారతదేశంలో ఉన్నతమైన సామాజిక వర్గాలలో రజకులు ఒకటని. కించపరిచి మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. మహానీయుల వారాసులను కించపరిచి మాట్లాడటం సరికాదన్నారు. రజకులకు క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే,నాయకులను అష్టదిగ్బంధనం చేస్తారని అన్నారు.అదేవిధంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తిసుకొవాలని డీమాండ్ చేశారు. ఆయన వెంట బహుజన సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల నియోజకవర్గ నాయకులు ఆకేపొగు వెంకట ఇతరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్