సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్బంగా బీజేపీ నాయకుల ముందస్తు అక్రమ అరెస్ట్ను భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తా వున్నాం. కేటీర్ నువ్వు వచ్చినప్పుడల్లా ఈ ముందస్తు అరెస్ట్లు ఏంటి అని అడుగుతావున్నాం. ప్రతిపక్ష నాయకులను పోలీస్లు 4:30 ప్రాంతంలో వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి మేము ఏమైనా దేశ ద్రోహులమా, విధ్వంసకారులమా, మీ తప్పులను ప్రశ్నిస్తే అరెస్ట్ అణిచివేతపై కాదు కేటీర్ మీరు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టండి.అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ధనిక రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రంగా చేసారు. మీ ప్రభుత్వం లో మీరు చేసే ప్రతి పనిలో కమిషన్ తీసుకొమ్మని మీరు చెప్పారని మీ పార్టీకి సంబందించిన సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ చెప్పారు.
మీరు చేసే ఏ పనిలో గాని నాణ్యత లేదు. మీ ఎలక్షన్ స్టాంట్లో భాగంగా త్వరగా మెడికల్ కాలేజీ పనులు కంప్లిట్ చేశారు. దాని నాణ్యత గురించి దేవునికే తెలియాలి. సిరిసిల్లలో కేటీర్ కి ఓటమి భయం పట్టుకుంది కేటీర్ గెలిచే పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి 3రోజుల నుండి సభకు మందిని తరలించడానికి తంటాలు పడుతుండు. కృతజ్ఞత సభలో కేంద్రం ఒక్కరూపాయి ఇయ్యాలే అన్నావ్ కేంద్ర విపత్తు నిర్వహణ క్రింద ఇచ్చిన నిధులు ఎం చేసినవ్ ఆ పైసలు పంట నష్టం ఇస్తా అన్నావ్ మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతావున్నాం రుణ మాఫీ చేయడానికి మీకు 9సంవత్సరాలు పట్టింది మరి రైతులు ఎలా సంతోషంగా వున్నారో చెప్పాలి ప్రక్కనున్న సిద్దిపేటకి పోయిన కాళేశ్వరం నీళ్లు నీ నియోజకవర్గంలోని అప్పర్ మానేరుకు ఎందుకు రాలేవు యువత సంతోషంగా వున్నారు అన్నావ్ ఎక్కడ సంతోషంగా వున్నారు.ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చినందుకా లేక మత్తుకు బానిసలుగా చేసినందుకా ఎన్నికలు వచ్చేలోపు మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తావున్నాం