రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128 వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఆ మహనీయురాలు ఆనాటి నుంచి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆమె వారసులుగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు రాష్ట స్థాయిలోని నాయకులు బాల మల్లన్న గాని మండల అధ్యక్షుడు నరసయ్య గాని తర్వాత మా సీనియర్ నాయకులు అందరం కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం.
ఆమె ఆనాడు అంతటి పాతకాలం లోపటనే ఆమె కొట్లాడి రసాకారులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వనిత. మంగళవారం రోజు హైదరాబాదులోనే రవీంద్ర భారతిలో లోపట ప్రభుత్వం చేస్తుంది చాలా సంతోషం. ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండి పైన ప్రతిష్టించాలని మా రజక సంఘం నాయకుల ఆకాంక్షాన్ని తెలియజేశారు.
