వర్గల్ మండల్ అక్టోబర్ 24: భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ.
గజ్వేల్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న సందర్భంగా గజ్వేల్ లో మొదటి భారీ బహిరంగ సభలో ఈటెల రాజేందర్ పాల్గొంటున్నారు.
బి జె పి లోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు ఉన్నాయి. ఈ భారీ సభ 26 అక్టోబర్ 2023 గురువారం రోజు ఉదయం 10:00ఏఎం గజ్వేల్ లో ఎస్- కన్వెన్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానీకి మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ పిలుపునియడం జరిగింది.
మండలంలోని కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పెద్దయెత్తున పాల్గొని సభను విజయవంతం చేయగలరు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ మరియు కుమ్మరి రమేష్, బీజేవైమ్ ,ఓబీసీ , కిసాన్మోర్చాల అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఉప్పరి శేకర్, కాయిత రాజు పాల్గొనటం జరిగింది.