తేది.23.09.2023
నిజామాబాద్
బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే గణేష్ బిగాల చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నిజామాబాద్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ
బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన పెయింటర్స్ అసోసియేషన్ సబ్యులకు శుభాకాంక్షలు తెలిపారు
ముఖ్యమంత్రి జనరంజక పాలన చూసి ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి జై కొడుతున్నారు.
బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు-అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారు.
కార్యకర్తలకు బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
బి.ఆర్.ఎస్ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,బి.ఆర్.ఎస్ నాయకులు సిర్ప రాజు,దండు శేఖర్,సూదం రవి చందర్ పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశపోగు అనీల్ ,సభ్యులు సంజీవ్ గౌడ్,నర్సింలు,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.





