తేదీ 15-సెప్టెంబర్-2023
పోలీస్ కమిషనర్ అదేశల మేరకు షిటీమ్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బంది మర్కుక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలసి జిల్లా పరిషత్ హై స్కూల్ పాములపర్తి విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, నిర్మూలన గురించి, మానవ అక్రమ రవాణా నిర్మూలన, గుడ్ టచ్, బాడ్ టచ్, షిటీమ్ సేవల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గజ్వేల్
షీటీమ్ అధికారులు సిబ్బంది మర్కుక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలసి ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరు కలిసిమెలిసి ఉండాలని సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం, గోల్ ఏర్పాటు చేసుకుని దాని కనుగుణంగా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకొని భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దు అని, బాల్య వివాహాలు, మానవ అక్రమా రవాణా గురించి సమాచారం ఉంటె మాకు తెలియజేయాలని సూచించారు. సెల్ ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని, ఎవరు కూడా సైబర్ నేరాలకు గురికావద్దు అని, తెలియని వ్యక్తులు నుండీ వచ్చే మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దని, బ్యాంక్ అధికారులము అంటు ఎవరైన ఫోన్ చేసి అకౌంట్ వివరాలూ అడిగితే చెప్పవద్దు అని లాంటి విషయాలు ఇంట్లో పెద్దలకు తెలియజేయాలని అన్నారు.
విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126673443 కాల్ చేయాలని సూచించారు. మహిళల రక్షణకు ఎల్లప్పుడు షీ టీమ్ అండగా ఉంటుందని తెలిపారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి, మహేష్, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, మరియు స్కూల్ హెడ్మాస్టర్ సుధాకర్, మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.