రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి సఖి కేంద్రమును సందర్శించి, సిబ్బంది తో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు సఖి సెంటర్ కు వచ్చిన కేసుల వివరాలను, ముఖ్యంగా సఖి కేంద్రం నందు ఉచితంగా అందించే సేవలు, కౌన్సెల్లింగ్, న్యాయ సలహాలు, పోలీస్ సపోర్టు, వైద్య సదుపాయం మరియు తాత్కాలిక వసతి అంశాల గురించి చర్చించడం జరిగింది.బాదిత మహిళలకు త్వరితగతిన న్యాయం జరిగేలాగా చర్యలు చేపట్టాలని సలహాలు సూచించడం జరిగింది.
సఖి కేంద్రం యొక్క సపోర్ట్ ఏజెన్సీ అయిన భూమిక వుమెన్స్ కలెక్టివ్, చీఫ్ ఫంక్షనరీ, కొండవీటి సత్యవతి గారు, ఇప్పటి వరకు సఖి కేంద్రములో 856 కేసులు నమోదు అయ్యాయని, అందులో ప్రదానంగా గృహ హింస – 470, వరకట్న వేదింపులు-60, పోక్సో – 78, మిస్సింగ్/కిడ్నాప్-44, ప్రేమ పేరుతో మోసం-36, వయో వృద్దులు – 32 మరియు ఇతరములు -136 రకాల కేసులు నమోదు కావడం జరిగిందని,
ఇప్పటివరకు దాదాపు 424 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో స్త్రీలు-41818, పురుషులు-14501, మొత్తముగా 56319 మంది పాల్గొనడం జరిగింది.
మరియు అలాగే ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ద్వారా, ట్రాంజెండర్ వ్యక్తులకు సలహాలు మరియు సూచనలు అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు 21 మంది ట్రాంజెండర్ వ్యక్తులకు, జిల్లా కలెక్టర్ గారిచే ట్రాన్స్ జెండర్ ఐడి కార్డులను అందించడం జరిగిందని తెలియజేయడం జరిగింది.