ప్రకటనలు ప్రాంతీయం

ఉద్యోగులకు బదిలీలు సహజమే….. సన్మానం మహోత్సవంలో తహసిల్దార్ జయంత్ కుమార్

343 Views

ఉద్యోగ బదిలీ సన్మాన మహోత్సవం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిపారు ఎల్లారెడ్డి పేట లో మండల వైద్యాధికారి గా గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ మైన సేవలు అందించి, ఉద్యోగ రీత్యా ఇతర జిల్లాకు బదిలీ అయినటువంటి డాక్టర్ ధర్మా నాయక్ సేవలు మండల ప్రజలు మరువలేని అని అన్నారు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వహించారు.  కార్యక్రమానికి ఎంపీపీ పిల్లి రేణుక – కిషన్ , వీర్నపల్లి జస్పీటీసీ గుగులోత్ కళావతి – సురేష్ , ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ ధర్మానాయక్ డాక్టర్ మీనాక్షిని సన్మానించారు. వారి యొక్క సేవలను గుర్తు చేశారు. చిరు సత్కారాలను అందించారు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం కు రాజన్న పెట్ సర్పంచ్ శంకర్,  కిష్టు నాయక్ తండ సర్పంచ్ ప్రభు నాయక్, బాకుర్ పల్లి తండా సర్పంచ్ రాజు నాయక్, ఎంపిడిఓ బింగి చిరంజీవి ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ జయంత్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా   వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు , డిప్యూటీ వైద్యాధికారి శ్రీరాములు , ప్రోగ్రామ్ ఆఫీసర్ రజిత , డాక్టర్ బాబు , డా ”స్రవంతి , డా ”చిరంజీవి  డా’ రఘు , డా ” ప్రదీప్ , మరియు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు స్టాఫ్ నర్సులుపాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్