రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 కేంద్రాలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష రేపు (శుక్రవారం) నిర్వహించబడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గారు తెలియజేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్ లతో సమావేశం నిర్వహించారు.
అభ్యర్థులందరూ పరీక్షా సమయానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాన్ని నిర్ధారించుకొని చేరుకోవాలని అన్నారు. మొదటి పేపరు ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు మరియు రెండవ పేపరు మధ్యాహ్నం 2:30 నుండి 5:00 గంటల వరకు నిర్వహించబడుతుందని అన్నారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలియజేశారు. పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీ రమేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.