రాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ….
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో దానధర్మాలు కానీ అనాధలకు నిత్యవసర సరుకులు రాచర్ల బొప్పాపూర్ లో బుధవారం రోజు వారసంత కూడా కుమారుని పేరు పైనే ప్రారంభించారు అతని పేరుపై ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అతని స్మృతులను మరవ లేకుండా అతను చేసిన చిలిపి పనులు కానీ అతని బంధువులను ఆత్మీయతంగా పలకరించే విధానాన్ని కానీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వంగల వసంత్ కుమార్ దంపతులు ఉంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం లాగా27-05-2023 రోజున కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి వృత్యప్రియ ఆశ్రమంలో అనాధ వృద్ధులకు దుప్పట్లు పండ్లు, పొలాలు, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వంగాల వసంత్ కుమార్ అనసూయ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు
