కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి..
ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞతా ర్యాలీ కృతజ్ఞత సభకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి భారీగా తరలి రావాలని పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు యువతకు మహిళాలకు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని పార్టీ జెడ్పీటీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ జెడ్పిటిసి కార్యాలయం నుండి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు బైక్ ర్యాలీ ద్వారా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద ముగుస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యం లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా తొమ్మిది మెడికల్ కాలేజీ లను , రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీని రాష్ట్ర గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా కృతజ్ఞతగా కృతజ్ఞతా ర్యాలీ కృతజ్ఞతా సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , స్థానిక సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి , క్లస్టర్ ఇన్చార్జిలు సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, ఏఎంసి డైరెక్టర్ గంట బాలా గౌడ్ , ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్, యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, నాయకులు ఎలగందుల నరసింహులు , మహమ్మద్ హసన్ , మేగి నర్సయ్య, కొత్త మల్లయ్య , వాసరవేణి దేవరాజు, సిరికొండ నాగరాజు , అఫ్జల్ , యూత్ నాయకులు మాద ఉదయ్, గంట వెంకటేష్ గౌడ్ , ఎలుగందుల గణేష్ బాబు , తదితరులు పాల్గొన్నారు.
