*వికారాబాద్*
*భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…*
*24 గంటలు అందుబాటులో ఉండేలా అత్యవసర టీంలను అందుబాటులో ఉంచాలి.టోల్ ఫ్రీ నంబర్ లు ఏర్పాటు చేయాలి.*
*వికారాబాద్ జిల్లా అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు….*
*ఇటీవలే తగ్గినట్లే తగ్గి సోమవారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాల పట్ల కలెక్టర్,ఎస్పీ లతో ఫోన్లో మాట్లాడి సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.జిల్లాలోని వర్షముకు సంభందించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రెవిన్యూ, పోలీస్,విద్యుత్ ,వైద్యం,మునిసిపల్,పంచాయతీ శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి.*
*ఎక్కడ కూడా ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలని,అవసరం ఐతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు.పాత గోడలు,శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో ఉంటున్న వారిని గుర్తించి,సమీపంలోని షెల్టర్ లకు తరలించాలన్నారు.*
*ప్రజలు కూడా వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు,కాలువలు,కుంటలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.నదులు,కాలువల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.*
*విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లవద్దని,ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.*
