ములుగుజిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14
మంగపేట మండలం చుంచు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శనగకుంట గ్రా మంలో డాక్టర్ వేణు ఆధ్వ ర్యంలో హెల్త్ క్యాంపు నిర్వ హించి ఇంటి ఇంటి ఫీవర్ సర్వే చేశారు .గ్రామ ప్రజ లందరికీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వ్యక్తిగత మ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు.ఈ హెల్త్ క్యాంపు లో 49 మందికి వైద్య పరీక్షలు చేయగా 10 మందికి జ్వరం ఉండడంతో వారికి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ పరీక్ష చేయగా నెగటివ్ వచ్చినట్లు డాక్టర్ తెలిపారు.ఈ కార్య క్రమంలో పిహెచ్ఎన్ శైలజ, హెచ్వి సారమ్మా,ఏఎన్ఎంలు, ఆశాలు,పాల్గొన్నారు.