రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బండలింగంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రోజు అదృశ్యం అయ్యాడని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ అన్నారు.
మండలంలో బండలింగంపల్లి గ్రామానికి చెందిన జంపి రెడ్డి అనే వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంకిత్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ మంగళవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటానని కుటుంబ సభ్యులకు తేలిపి బుధవారం రోజు వరకు తిరిగి రాకపోవడంతో భార్య జయ హేమ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.