విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపాలి
సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు బస్సు వస్తుందని అలాగే సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే బస్సును చేర్యాల నుండి నడపాలని డిఎం తో మాట్లాడటం జరిగింది దీనివల్ల బస్సు మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్లిపోవడం వల్ల కాలేజీ నుండి విద్యార్థులు రాకుండానే బస్సు వెళ్ళిపోతుందని అందువల్ల ఒక గంట ఆలస్యంగా బస్సును నడపాలని డిఎం ని కోరడం జరిగింది దీనికి స్పందించిన డిఎం నేటి నుంచి నాలుగు గంటల తర్వాతనే బస్సును కొనసాగిస్తామని తెలిపారు
స్పందించిన డిఎంకు పత్రిక విలేకరులకు కత్తుల భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు





