రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపారు ప్రకారం సింగారం గ్రామానికి చెందిన బొమ్మిడి కొండయ్య (45) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు బుధవారం రోజు యధావిధిగా విధులు నిర్వహించుకొని సాయంత్రం ఇంటికి రాగా భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొరాగా అప్పటికే కొండయ్య గుండెపోటుతో ముత్తుతుందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యుల రోజులను మిన్నంటాయి.మృతునికి భార్య పుష్ప,కొడుకు ప్రశాంతు, కూతురు ప్రణీత ఉన్నారు.




