రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందాడు.ఖమ్మం జిల్లాకు చెందిన సాధుల్లా కాళీ ప్రసాద్(61) అని ఎస్సై మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీ అయ్యాడు. ఇతని భార్య భార్యసావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయనే అద్దెకు ఉంటున్న రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపు తట్టి ఆయనను పలకరించగా ఎలాంటి స్పర్శ రాకపోవడంతో స్థానిక ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించాడు సమాచారం అందుకున్న సిఐ సంఘటన స్థలం చేరుకొని మృతి చెందిన ప్రసాద్ ను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట ఇప్పటికి వస్తున్నారు.స్థానిక ఎస్సై రమాకాంత్ మృతదేహం వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించికుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని అన్నారు.మృతునికి కుమారుడు సాయి రేవంత్,కూతురు ఉన్నారు.




