తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో నిర్మించిన రిజర్వాయర్ పేరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని మల్కపేట రిజర్వాయర్ కు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు,బడుగు బలహీన వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్కాపేట గ్రామ వాస్తవ్యుడు కామ్రేడ్ …. కర్రోల్ల నర్సయ్య రిజర్వాయర్ గా నామకరణం చేయాలని బుధవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు రాగుల రాములు ,అంకం భాను ,గుంటి వేణు ,మూషం రమేష్ , ఎర్రవెల్లి నాగరాజు ,కోడం రమణ,జవ్వాజి విమల,సూరం పద్మ,అన్నల్దాస్ గణేష్, పుష్పల,
రవి, లింగంపల్లి మధుకర్ నాయకులు పాల్గొన్నారు.