సెప్టెంబర్ 14 గజ్వేల్
సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు….
ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీ ని గురువారం స్థానిక *మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా* మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, AE శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని జర్నలిస్టులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ శానిటేషన్ తదితర సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కమిషనర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో కాలనీలో సమస్యలు క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ శానిటేషన్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు తెలిపారు. కాలనీలో జిమ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే జిమ్ ఏర్పాటు చేయటానికి హామీ ఇచ్చారు. కాలనీలోని ఓపెన్ ప్రదేశాల్లో ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటడానికి కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తెలిపారు. తమ సమస్యను గుర్తించడానికి వచ్చి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ చైర్మన్, కమిషనర్లకు కాలనీలోని జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సత్యనారాయణ రావు, జమీల్, జగన్, కిరణ్, మధు, శ్రీను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సూపెర్వైసోర్లు అంజి రాజ్, వేణు , మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
