24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 6
–అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా..
–ఎండాకాలంలోనూ నిండుగా ఉండే కాలువ ఎండిపోవడంపై కేసీఆర్ ఆవేదన
–సముద్రాన్ని తలపించిన మధ్యమానేరు ఎండిన ఎడారిలా మారడంపై ఆందోళన
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా చలించిపోయారు.
అయ్యో! వరద కాలువ పరిస్థితి ఇంత దారణంగా తయారయ్యిందా? ఎండాకాలం కూడా నిండుగా నీళ్లతో ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయిన దృశ్యాన్ని చూసి ఖిన్నుడయ్యారు. బస్సులోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన విషయాన్ని కేసీఆర్‌కు వివరించారు. అక్కడి నుంచి సిరిసిల్ల వెళ్తూ శాభాష్‌పల్లి వద్ద హై లెవల్ వంతన మీదుగా మధ్యమానేరును పరిశీలించిన కేసీఆర్ మరింతగా ఆవేదన వ్యక్తంచేశారు. సముద్రాన్ని తలపించిన మధ్యమానేరు ఇప్పుడు ఎండిన ఎడారిలా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
నీటిమట్టం పూర్తిగా పడిపోవడంతో ముంపునకు గురైన గ్రామాలు బయటపడడాన్ని కేసీఆర్ గమనించారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు సర్దార్ రవీందర్‌సింగ్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు ఉన్నారు.
