ప్రాంతీయం

న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలి

211 Views

దౌల్తాబాద్, సెప్టెంబర్ 13: అంగన్ వాడి టీచర్లు, ఆయాలకు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆది రంగన్న అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు, ఆయాలు నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి రిటర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ కు పది లక్షలు, ఆయాకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సుల్తానా, భాగ్య, మంజుల, శ్యామల తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *