అమరుల సంస్మరణ సభను విజయవంతం చేయండి
రేపు బైరాన్ పల్లికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభా పక్ష నేత చాడ వెంకట్ రెడ్డి రాక..
సెప్టెంబర్ 13
సిద్దిపేట జిల్లా మద్దూరు : తెలంగాణ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవాలలో భాగంగా రేపు 14-9-2023 గురువారం సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి మద్దూరు మండలంలోని వీర బైరాన్ పల్లిలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద పవన్, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరుకానున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తుపాకీ తూటాలకు అమరులైన అమరవీరులకు స్తూపం వద్ద నివాళులర్పించి, అనంతరం బురుజు వద్ద బహిరంగ సభ జరుగుతుందని, ప్రజానాట్యమండలి కళాకారుల చేత కార్యక్రమాలు ఉంటాయని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.*
