రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని నర్మాల ఎంపియుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని, ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుందని, మన ఊరుమనబడి కింద ప్రభుత్వపాఠశాలలో ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని వారు తెలియజేశారు ఈకార్యక్రమంలో నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు, ఎంపీటీసీ గొర్రె బాలమణి, ప్రధానోపాధ్యాయురాలు కత్తి స్వరూప రాణి ,ఎస్ఎంసి చేర్మెన్ ధ్యానబోయిన రాజేందర్, వైస్ చేర్మెన్ బొంగు నీలిమ, వార్డు మెంబర్లు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
