Breaking News

పూర్వవైభోగం తీసుకురావడమే నా లక్ష్యం 

111 Views

జోగిపేటకు పూర్వవైభోగం తీసుకురావడమే నా లక్ష్యం

ఫిబ్రవరి 18

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మంత్రి మాట్లాడుతూ అందోలు జోగిపేట జంట పట్టణాలను సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దుతానని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. అందోల్ జోగిపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా అందోల్ జోగిపేట ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దానని. ఇప్పుడు వైద్య శాఖ మంత్రిగా వైద్య హబ్ గా అభివృద్ధి చేస్తానని తెలిపారు. జోగిపేట నుంచి అజ్జమర్రి వరకు బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు అయ్యాయని. దీంతో జోగిపేటకు వ్యాపార లావాదేవీలకు అనుసంధానంగా ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందోల్ లో 12 ఎకరాల లో 150 పడకల ఆసుపత్రి. 60 సీట్లతో నర్సింగ్ కాలేజ్ చేపడుతున్నామనితెలిపారు. సంగుపేట్ చౌరస్తా నుంచి అన్నాసాగర్ వరకు రోడ్డు వెడల్పు చేసి డివైడర్ లైటింగ్ పనులు చేపడతామన్నారు.

విద్యాసంస్థలకు ప్రహర గోడలు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు.

క్లాక్ టవర్ నుంచి ఎర్రారం వరకు రోడ్డు పనులు కూడా త్వరలోనే చేపడతామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్. సురేందర్ గౌడ్, డాకూరి శంకర్, ఆకుల చిట్టిబాబు, కోరబోయిన నాగరాజ్ (నాని) మాజీ ఎంపీటీసీ డాకూరి వెంకటేశం పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్