* మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని దుబ్బాక పోచమ్మ నుండి బోయ సంఘం వరకు గురువారం మట్టి రోడ్డు నిర్మాణ పనులకు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు భూమి పూజ కు స్వీకారం చుట్టారు ఈ నిర్మాణం ద్వారా రైతులకు గ్రామ ప్రజలకు ఎంత గానో లబ్ది చేకూరుతుంది అని పనులు ప్రారంభించిన మేజర్ గ్రామ పంచాయతీ కటకం శ్రీధర్ పంతులు కి హనుమాన్ నగర్ మరియు బరిగెల గూడెం ప్రజలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ఉపసర్పంచ్ సింగారపు నాగరాజు గౌడ్ , వార్డు సభ్యులు రాజిరెడ్డి , ఎగదండీ స్వామి , గ్యార దేవరాజు సంతోష్ రెడ్డి , మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.