Breaking News

తెలంగాణాలో టీఆర్టీ కంటే ముందు మరో టెట్ నిర్వహించిన్యాయం చెయ్యాలని

105 Views

*సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్న టెట్ ఫెయిల్ ఐనా అభ్యర్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా  తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధ్యాయ అర్హత పరీక్షా (టెట్)ని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్ సిటీఈ)రూల్స్ ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒక్క సారి నిర్వహించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2017 డీఎస్సి కంటే ముందు యాడాదికి ఒక్క సారి టీఎస్ టెట్ నిర్వహించి అప్పటి నుంచి ఇప్పటి వారికి ఐదు సంవత్సరాల తరువాత మల్లిటెట్ నిర్వహించడంతో చాలా మంది డీ ఎడ్, బి ఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 మరియు పేపర్-2 రాసారు అందులో పేపర్ -2 కి 49.64% పాస్ అయ్యారు పేపర్-1 లో కేవలం 32% అభ్యర్థులు పాస్ కావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తే తమకు ఈ పరిస్థితి రాకపోయేది అని,రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యాడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలి అని చాలా మంది టెట్ లో ఫెయిల్ ఐన అభ్యర్థులు డీఎస్సి కంటే ముందు ఇంకో టెట్ మల్లి నిర్వహించాలని తమకు ఇంకో అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలో కూడా ప్రభుత్వం 2017 టీఆర్టీ కంటే ముందు రెండు టెట్ లు నిర్వహించిందని ఇప్పుడు కూడా అదే తరహాలు టీ ఆర్ టీ కంటే ముందు డిసెంబర్ వరకు ఇంకో టెట్ నిర్వహించాలని ఎంతో ఆశతో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల భవిషత్తు దృష్టిలో పెట్టుకొని టెట్ లో క్వాలిఫై కానీ వారికీ ప్రభుత్వం ఇంకో అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ వేడుకుంటున్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna