Breaking News

24/7 నిరంతరం అప్రమత్తంగా వుండాలి – సి పి

8 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

24/7 నిరంతరం అప్రమత్తంగా వుండాలి.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు.

కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్.

శాంతి భద్రతల,నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం 24*7 నిరంతరం అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS పోలీస్‌ అధికారులకు సూచించారు.

నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా  ఈరోజు కమిషనరేట్‌ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపి లు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌  ముందుగా పోలీస్‌ స్టేషన్‌, డివిజిన్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌ వారిగా పోలీస్‌ అధికారులతో సమీక్షా జరిపారు. అదేవిదంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించడంతో పాటు, అధికారులతో పొలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ….కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని, అలాగే కేసు నమోదయిన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని స్టేషన్‌ అధికారులు ప్రతి రోజు ఒక గంట పాటు పెండింగ్‌ కేసులను సమీక్షా జరపాలని,పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాల్సిందిగా అలాగే మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగం స్పందించాలని, రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహిరంచాలని, దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కల్సి పనిచేయాలని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని పోలీస్‌ అధికారుల పనితీరుపైనే రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి వుంటాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

*బెల్లంపల్లి పట్టణం లోని కాల్టెక్స్ ఏరియాలోని ఏటీఎం దొంగతనానికి యత్నం చేసిన దొంగలని చాకచక్యంగా పట్టుకొన్న నేన్నాల్ ఎస్ఐ ప్రసాద్, బ్లూ క్లోట్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ సాయి, హోం గార్డ్ సంపత్ లను సిపి కాష్ రివార్డ్ అందించి అబినందనలు తెలిపారు.*

ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎ .భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, కమీషనరేట్ పరిది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు సిసి హరీష్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్