సిద్దిపేట బస్టాండ్ నుంచి ఓ వ్యక్తి ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి వేములవాడ బస్టాండుకు తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారు వద్ద వదిలిపెట్టాడు. ఈ వార్త వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అవును మీరు చదివేది నిజమే ఓ వ్యక్తి సిద్దిపేట బస్టాండ్ లో ఉన్న బస్సును వేములవాడ బస్టాండ్ కు తీసుకొచ్చి ప్రయాణికులను వదిలిపెట్టి తిరుగు మళ్లీ ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకొని మరల హైదరాబాద్ వైపు వెళ్తుండగా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారు రాగానే బస్సులో కాస్త డీజిల్ అయిపోయింది.
పాపం మనవాడు డిజిల్ ఉంటే మాత్రం ఎక్కడికి తీసుకెళ్లేవాడో ఇదిలా ఉండగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఎత్తుకెళ్లిన సోయి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు అని మరోవైపు ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా మనోడు వేల మంది ప్రయాణికులు ఉన్న బస్టాండ్ లో నుంచి ఆర్టీసీ బస్సు ని ఎత్తుకెళ్లాలంటే చాలా గట్టిోడే అనుకుంటున్నారు. ఈ వార్త చదివేవారు. మరి ఇప్పటికైనా ఆ ఆర్టీసీ బస్సును గుర్తించి తీసుకువెళ్లిపోయే అధికారులకు సోయి ఇప్పటికైనా వచ్చినట్లే అనుకుందామా…?