ప్రాంతీయం

పేదింటి ఆడపడుచుకు సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్త పుస్తె మట్టెలు అందజేత

138 Views

 

జగదేవపూర్    మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన శ్రీపతి నరసయ్య సత్తమ్మ దంపతుల కూతురు రజిత వివాహానికి ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా పుస్తెమట్టెలు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా అని గ్రామ ప్రజలు కొనియాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ మనం సంపాదించిన దానిలో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడం లోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని అన్నారు.గ్రామం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానాని తెలిపారు.గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు కర్తవ్యమన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్ద మనుషులు వెంకటయ్య,శ్రీపతి నర్సింలు, కిష్టయ్య, వార్డు సభ్యులు శ్యామల నర్సింలు, బాలమణి ఆంజనేయులు, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ మల్లేష్. యూత్ నాయకులు బాస్కర్. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *