ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, మండల కేంద్రంలో పేరుకే మేజర్ గ్రామపంచాయతీ ప్రజల కొరకు మూత్రశాలలు ఉన్నప్పటికీ నామమాత్రంగా నిర్మించి గాలికి వదిలేసారని పలువురు. పురుషులు, మహిళలు బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూత్రశాలలకు పురుషుల, మహిళల గదులకు డోర్ లు సరిగా లేకపోవడం. అపరిశుభ్ర వాతావరణంవల్ల మూత్రశాల సమీపంనుండి ప్రజలు అటుగా వెళ్తూ ఉండగా దుర్వాసన కొంత సమయం ఊపిరి బిగ్గపట్టుకుని వెళ్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్యం కొరకు వాహనాలతోపాటు పరికరాలు స్ప్రే మిషన్లు, బ్లీచింగ్ అందుబాటులో ఉండగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచమని ప్రభుత్వం ఓవైపు చెబుతూ ఉంటే నిమ్మకు నీరెత్తనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల ఆరోపణలు. అపరిశుభ్ర వాతావరణం వల్ల దోమలు, తయారైతున్నాయని ప్రధాన రహదారికి రోడ్డు ఆనుకొని ఉండటం, విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్లడం, పలు ఆఫీసులకు ఈ దారినుండే వెళ్లడంవల్ల అదేవిధంగా ఆదివారం వస్తే భారీ మొత్తంలో అంగడి ఈదారి రద్దీగా మారడంతో దుర్వాసనతో భరించలేకపోతున్నాంమంటున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధుల బారిన పడుతుండగా మండల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ కుర్చీలకే పరిమితమయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో చేరువలో ఉండి తమ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈమండలంమే కాకుండా వేరే మండలాల ప్రజలు మండల కేంద్రానికి నిత్యం తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం వస్తూపోతూ ఉంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరితగతిన మూత్రశాలలు శుభ్రంచేయించి డోర్లు అమర్చీ ప్రజలు వినియోగించుకునేలా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.




