3-03-2023 తేదీన మున్సిపల్ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో రెండు పడక గదుల లబ్ధిదారుల ఎంపిక కోసం 1389 మంది పేర్లతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో కొంతమంది ఇండ్లు ఉన్నవారు కూడా ఉన్నారు. నిజమైన నిరుపేదలకు న్యాయం జరగలేదు.కావున మొత్తం అప్లికేషన్లు 3300 తిరిగి రిసర్వే చేయించి జాబితాను తయారు చేయించి నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగలరని కోరుచున్నాము. లాటరీ పద్ధతిలో కాకుండా సర్వే ద్వారానే ఎంపిక చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం సర్వే ద్వారా ఎంపిక చేస్తేనే నిజమైన లబ్దిదారులకు న్యాయం జరుగనుంది. కావున తమరు ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించి లాటరీ పద్ధతి ద్వారా కాకుండా మరి ఒకసారి సర్వే ద్వారా ఎంపిక చేయాలని కోరుతున్నాము. ప్రస్తుతం ఈనెల 6 వతారీకు డ్రా కార్యక్రమాన్ని దయచేసి వాయిదా వేయవలసిందిగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ కోరారు.
