ప్రాంతీయం

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో ఠాణా దివస్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

117 Views

గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 11 తెలుగు న్యూస్ 24/7

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లోని గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో 12-09-2023 మంగళవారం నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని గంభీరావుపేట్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..
శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమంలో భాగంగా 12-09-2023 మంగళవారం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉండి మండల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి,దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు,ఫిర్యాదులను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవలసిందిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *