(తిమ్మాపూర్ జనవరి 17 )
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న అమ్మ న్యూస్ ఛానల్ వారి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మిత్ర రియల్ ఎస్టేట్ అధినేత పోలం మలేష్ యాదవ్ వారి కార్యాలయంలో తన మిత్రులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పొలం మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ..
అమ్మ న్యూస్ ఛానల్ ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని, అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి కొత్త ట్రెండును సృష్టించిందన్నారు. తక్కువ కాలంలోనే అందరి ఆధరాభిమానాలను పొందిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభ్యున్నతి చెందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సంధవేణి కుమార్ యాదవ్, ప్రదీప్ రావు, కాల్వ శ్రీనివాస్, రేషవేణి మహేష్, లక్ష్మణ్, అజయ్,తదితరులు పాల్గొన్నారు..




