*మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో పోషణ మాసం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించడం జరిగింది అందులో అంగన్వాడీ సెంటర్ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు మరియు గర్భిణీలు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో అందించే పోషకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలిఅని సిడిపిఓ ఆధ్వర్యంలో అవగాహనా కల్పింస్తూ ప్రతిజ్ఞ చేశారు. నెల లో 3 వ శనివారంరోజున రాగి ముద్దల తో పౌష్టికాహారం అందించాలి అని దానికి సంబందించి గ్రామ పంచాయతీ నుండిఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకంశ్రీధర్ పంతులు ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరవింద, పంచాయతీ సెక్రెటరీ ఈ ఓ మజీద్ గ్రామ వార్డు సభ్యులు రెడ్డిమల్లరాజనర్సు , వికాస్ బాబు, ఎగదండీ స్వామి, అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్, ఎ ఎన్ ఎం ప్రమీల , వివో మహిళా సంఘాల వారు సభ్యులు మరియు ప్రజా ప్రతి నిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.