సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ లో ఒక కేసు విచారణలో అవకతవకలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణల నేపథ్యంలో సబ్-ఇన్‌స్పెక్టర్ పి. రవిబాబు ను క్రమశిక్షణా చర్యలలో భాగంగా తక్షణమే సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ.*
*నిర్లక్ష్యంగా విధినిర్వహణ, కేసు నుండి నిందితులను తొలగించిన వైనం.పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి. అతిక్రమిస్తే తీవ్రమై
సూళ్లూరుపేట పోలిస్ స్టేషన్ యస్.ఐ గా రవిబాబు విధులు నిర్వహిస్తూ 2023 సం.లో ఒక హత్యాయత్నం కేసు విషయంలో నిర్లక్ష్యపు విచారణ చేసి, కీలకమైన ప్రత్యక్ష సాక్షులను విచారించడంలో వైఫల్యం చెందడం, నిందితులను అనధికారికంగా తొలగించారనే అనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై జిల్లా ఎస్పి గారు విచారించగా పి.రవిబాబు ఎస్ఐ 28-08-2021 నుండి 09-10-2023 వరకు సూళ్లూరుపేట PS లో పని చేస్తున్న సమయంలో ఒక హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో గాయపడిన వ్యక్తిని మరియు ప్రత్యక్ష సాక్షిని విచారించడంలో అతను విఫలమయ్యాడు.
పై అధికారుల నుండి అనుమతి లేకుండా ఈ కేసుకు సంభందపడిన నిందితులను తొలగించి, ఫిర్యాదుదారునికి ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కేసును తప్పు దోవ పట్టించారు. నేరం జరిగిన ప్రదేశంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను గౌరవ న్యాయస్థానం ద్వారా RFSLకి పంపకుండా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసాడని తెలిసింది. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారు తీవ్రంగా పరిగణిస్తూ సదరు ఎస్ఐ ని ఈరోజు సస్పెన్షన్ చేశారు.
పోలీస్ శాఖ లో ఎవరైనా సరే క్రమశిక్షణ మరియు వృత్తి నైపుణ్యం యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటించకపోతే సహించేది లేదు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి.
పోలీస్ శాఖ అంటే నిర్దిష్టమైన క్రమశిక్షణ కలిగిన సేవ.. ఎప్పుడూ ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి.
ఎవరైనా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు జిల్లా పోలీసులను హెచ్చరించారు.
