Breaking News

సేవలు చిరస్మరణీయం

96 Views

చేర్యాలకు సురేందర్ రావు సేవలు చిరస్మరణీయం

సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్

సురేందర్ రావు మృతి పట్ల సీపీఐ చేర్యాల మండల కమిటీ నివాళులు

జనవరి 23

సిద్దిపేట్ జిల్లా చేర్యాల  చేర్యాలకు సురేందర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల పట్టణానికి చెందిన భూదాత కల్వకోట సురేందర్ రావు (80) అనారోగ్యంతో మృతి చెందారు. మృతి పట్ల సీపీఐ నాయకులు పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.

కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. సురేందర్ రావు దొర చేర్యాల పట్టణంలో వందల ఎకరాలు ప్రభుత్వానికి పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చి భూ దానకర్తగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.

చేర్యాల బస్టాండ్, వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు స్థలాన్ని ఇచ్చి భూమి దానం చేసి గొప్ప మనసు చాటుకున్న వ్యక్తి సురేందర్ రావు అని ఆయన సేవలను కొనియాడారు. నివాళులర్పించిన  సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సిపిఐ డివిజన్ కమిటీ సభ్యులు జంగిలి యాదగిరి, నంగి కనకయ్య, తిగుల్ల కనకయ్య, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ లు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *